దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే : మంత్రి హరీశ్‌రావు

దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదే : మంత్రి హరీశ్‌రావు
గత పాలకులు భూమి యజమానుల నుంచి శిస్తు వసూలు చేస్తే.... సీఎం కేసీఆర్‌ రైతుబంధు ద్వారా డబ్బులు ఇస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు..

గత పాలకులు భూమి యజమానుల నుంచి శిస్తు వసూలు చేస్తే.... సీఎం కేసీఆర్‌ రైతుబంధు ద్వారా డబ్బులు ఇస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దుబ్బాక ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఘనాపూర్‌, గుడికందుల గ్రామాల్లో మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడైనా తాగునీటి సమస్య ఉందా? అని అన్నారు. సాధ్యం కాదనుకున్న గోదావరి జలాలను సిద్దిపేట జిల్లాకు తీసుకొచ్చిన ఘనత... సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. జిల్లా మంత్రిగా దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనదేనని హరీశ్‌రావు ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ మక్కలు తీసుకొచ్చి రైతుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోందని విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story