Tomato Price : హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర, కేజీ టమాటా ధర ఒకటే..!

Tomato Price : హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్ ధర, కేజీ టమాటా ధర ఒకటే..!
Tomato Price : హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కేజీ 20 రూపాయలకు అటుఇటుగా ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా 100 దాటేసింది.

Tomato Price : హైదరాబాద్‌లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కేజీ 20 రూపాయలకు అటుఇటుగా ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా 100 దాటేసింది. అన్ని మార్కెట్లలో ఈ ధర 100 నుంచి 110 వరకూ పలుకుతోంది. 25 కేజీల బాక్స్ 10 రోజుల క్రితం 700 నుంచి 800 ఉంటే ఇప్పుడు 1800 దాటింది. హోల్‌సేల్ మార్కెట్‌లనే ఈ రేటు 75 వరకూ ఉంటుంటే.. సూపర్ బజార్లు, వీధి చివర సంతల్లోకి వచ్చేసరికి ఇది 100 దాటేస్తోంది.

కొన్ని హోల్‌సేల్‌ మార్కెట్లలో 60 రూపాయలే ధర నిర్ణయించినా స్టాక్ మాత్రం లేదు. ఈ పరిస్థితుల్లో టమాటా కొనాలంటేనే సామాన్యుడు భయపడుతున్నాడు. హైదరాబాద్‌కి ప్రధానంగా ఏపీలోని చిత్తూరు, అనంతపురం నుంచి లోడ్లు వస్తుంటాయి. ఈ సారి వర్షాల ప్రభావానికి పంట దెబ్బతినడంతో రేటు అమాంతం పెరిగిపోయింది.

మిగతా కూరగాయలు కూడా ప్రతీది కేసీ 60 దాటేశాయి. ఆకుకూరలు కూడా రేట్లు డబుల్ అయిపోయాయి. ఇక ఉల్లి ధర కూడా కన్నీరు పెట్టిస్తుంది. ఇప్పుడు చాలాచోట్ల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్లో రేట్లు మరింత పెరుగుతాయనే మాట.. వినియోగదారులకు గుబులు పుట్టిస్తోంది. గుప్పెడు మెతుకులు గొంతు దిగాలన్నా.. భారీగా ఖర్చు చేయాల్సి రావడంతో సామాన్య కుటుంబాల బడ్జెట్ తల్లకిందులవుతోంది.

పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసరాలు ఇప్పటికే భారంగా మారిన నేపథ్యంలో.. కూరగాయలు కూడా అందుబాటులో లేకుంటే ఇక ఏం తిని బతకాలని పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లీటరు పెట్రోల్ ధర, కేజీ టమాటా ధర ఇప్పుడు హైదరాబాద్‌లో ఈక్వల్ అయిపోయాయి. ఇవే కాదు కార్తీక మాసం పేరు చెప్పి మిగతా కూరగాయల రేట్లు కూడా పెంచేశారంటున్నారు.

-

Tags

Read MoreRead Less
Next Story