TS: నేడే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

TS: నేడే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం
భద్రాచలంలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి... మణుగూరులో ప్రజా దీవెన బహిరంగ సభ

తెలంగాణలో ఆరు గ్యారంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కో హామీని అమలు చేస్తోంది. ఇప్పటికే నాలుగు హామీలను అమలు చేసిన సర్కారు నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించనుంది. ముందుగా భద్రాచలంలోని సీతారామలు దర్శించుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక మార్కెట్ యార్డులో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించునున్నారు. ఈ కార్యక్రమానికి 3వేల మందిని అనుమతించనున్న నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం C.M రేవంత్ రెడ్డి మణుగూరులో జరిగే ప్రజా దీవెన బహిరంగ సభకు హాజరు కానున్నట్టు తెలంగాణ రెవెన్యూశాఖ మంత్రి పొంగులేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.


మరోవైపు తెలంగాణలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏలు, ఇతర అంశాలపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సాయంత్రం... ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలతో సమావేశమైన రేవంత్ రెడ్డి వారి సమస్యలను విన్నారు. 317 జీవో సహా వేర్వేరు సమస్యల పరిష్కారానికి..... ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం వేసినట్టు గుర్తుచేసిన సీఎం. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యోగుల తరపున ప్రాతినిధ్యం ఉండాలని చెప్పిన రేవంత్ రెడ్డి తెలంగాణను తామే సాధించామని ఏ ఒక్కరు చెప్పుకున్నా అది అసంబద్ధమే అవుతుందన్నారు. విద్యార్థి, ఉద్యోగ, కార్మికుల పోరాటంతోనే తెలంగాణ సిద్దించిందన్న ఆయన తెలంగాణ కోసం చాలా మంది ప్రాణాలు, రక్తం ధారపోశారని గుర్తుచేశారు. సంఘాలపై కక్షగట్టి వాటిని రద్దు చేస్తే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేశారన్న రేవంత్ అన్నారు. ఇకపై సంఘాలతో చర్చించకుండా నిర్ణయాలుతీసుకోబోమని ముఖ్యమంత్రి చెప్పినట్టు భేటీ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు.


మరోవైపు ఇందిరమ్మ రాజ్యంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గత పాలకులు పేదల కష్టాన్ని, అభివృద్ధి, సంక్షేమాన్ని విస్మరించారని విమర్శించారు. మహిళలను అందలమెక్కిస్తూ పాలన అందిస్తుంటే ఓర్వలేక MLC కవిత అనవసర విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు అమాత్యులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. , వరంగల్ జిల్లాలో ఇంఛార్జ్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. మంత్రులు కొండా సురేఖ, సీతక‌్కలతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కాకతీయ విశ్వవిద్యాలయంలోని K-హబ్, పీవీ నరసింహరావు విజ్ఞాన కేంద్రాన్ని ప్రారంభించారు. షెడ్యూల్ తెగల విద్యార్థినులకు వసతి గృహాన్ని ప్రారంభించారు. KU ప్రహారి గోడ, సమ్మయ్యనగర్‌ రహదారుల విస్తరణకు మంత్రి శంకుస్థాపన చేశారు. వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి 258కోట్ల రూపాయల ప్రగతి పనులకు శ్రీకారం చుట్టారు.

Tags

Read MoreRead Less
Next Story