ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీ..

ఇంటర్మీడియెట్ పరీక్షల తేదీ..
కరోనా ప్రభావంతో కాలేజీలకు వెళ్లకుండానే విద్యాసంవత్సరం గడిచి పోయింది.

కరోనా ప్రభావంతో కాలేజీలకు వెళ్లకుండానే విద్యాసంవత్సరం గడిచి పోయింది. వార్షిక పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలనేదానిపై తెలంగాఫ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. విద్యార్థులకు ఓ వారంలో స్పష్టత ఇస్టామని ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు సిలబస్, ప్రాక్టీస్, ఎగ్జామ్స్ ఇలా అన్నింటిపైనా ఓ వారంలో క్లారిటీ ఇస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఇందుకు సంబంధించి మంత్రి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో, విద్యార్థుల తల్లిదండ్రులతో ఓ సమావేశం ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలను ఎప్పుడు తెరవాలనే అంశంపై చర్చించారు. స్కూళ్లలో రెగ్యులర్ తరగతులు తప్పనిసరి కాదన్న మంత్రి.. ఫీజులకు సంబంధించి జారీ చేసిన జీవో 46ను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రస్తుతం ఫీజుల అతిక్రమణకు సంబంధించి కోర్టులో 12 స్కూళ్ల కేసులు ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై మే మధ్య వరకు జరుగుతాయని తెలిపింది. పరీక్షల షెడ్యూల్‌కు సంబంధించి డేట్స్ త్వరలో ప్రకటిస్తామని అన్నారు.

అయితే ఈ సారి పేపర్ మోడల్ మారనుందని అందులో 70 శాతం కరిక్యులమ్ ద్వారా ఉంటుందనీ.. మిగిలినది ప్రాజెక్టు, అసైన్‌మెంట్ల ద్వారా ఉంటుందని తెలిపారు. ఇంకా ఛాయిస్ కూడా ఎక్కువగా ఉంటుంది అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

ఇదిలా ఉంటే కాలేజీ విద్యార్ధులకు ఫిబ్రవరి 1నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం కాలేజీ విద్యార్ధుల సంఖ్య 300 మంది కంటే తక్కువ ఉంటే ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 4 వరుకు నిర్వహించాలని అదే 300 మంది కంటే ఎక్కువ వుంటే రెండు షిప్ట్‌ల్లో క్లాసులు జరపాలని తెలియజేసారు. అంటే ఉదయం 8.30 నుంచి 12.30 వరకు ఒక షిప్ట్, మధ్యాహ్నం 1.30 నుంచి 5.30 వరకు రెండో షిప్ట్ క్లాసులు జరుగుతాయి.

ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరిగిన తరువాతే థియరీ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష ఫీజు వివరాలు, పరీక్షల షెడ్యూల్ త్వరలో ప్రకటిస్తామని బోర్డు అధికారి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story