బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
అందరికంటే రెండు రోజుల ముందుగానే హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరగడం అందులో తాను పాల్గొనడం సంతోషంగా ఉంది

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ముందే ఘనంగా ప్రారంభించారు హైదరాబాద్ పోలీసులు. బేగంపేట విమానాశ్రమయంలో జరిగిన కార్యక్రమంలో పోలీస్ శాఖకు చెందిన మహిళ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ కమీషనర్ అంజనీకుమార్ దంపతులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

నూట పదేళ్ల క్రితం అంతర్జాతీయంగా తొలి మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అందరికంటే రెండు రోజుల ముందుగానే హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరగడం అందులో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు ఆయన అభినందనలు తెలిపారు. కరోనా సమయంలో మగవారితో సమానంగా మహిళా పోలీసులు కూడా ఎంతో విధుల్లో పాల్గొని ఎంతో త్యాగం చేశారని కొనియాడారు.

మహిళల రక్షణ కోసం విశేష కృషి చేస్తున్న పోలీసు శాఖకు మాజీ మిస్ ఇండియా తేజస్వీని మనోజ్ఞ సెల్యూట్ చేశారు. మహిళలకు ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందిస్తున్నారని అన్నారు. ఇక తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన కుటుంబం ఎంతో తోడ్పాటును అందించిందన్నారు.


Tags

Read MoreRead Less
Next Story