BRS ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

BRS ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. అధికార పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. అధికార పార్టీ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ కొత్తపేటలోని ఎమ్మెల్యే నివాసంలో అధికారలు సోదాలు నిర్వహిస్తున్నారు. పైళ్ల శేఖర్ రెడ్డి ఇల్లు కార్యాలయాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. హిల్ ల్యాండ్ టెక్నాటజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. అయితే ఆ రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనితా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏకకాలంలో మొత్తం 12 చోట్ల ఐటీ సోదాలు జరుపుతున్నారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story