ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి సోదాలు

ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి సోదాలు
గత కొంతకాలంగా IT శాఖా అధికారులు ఎమ్మెల్యే పైళ్ళ వ్యాపారం, ఆదాయం మీద ఫోకస్ పెట్టారు. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో సోదాలు చేస్తున్నారు.

భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఆరు గంటలుగా హైదారాబాద్ లోని చైతన్యపురిలో ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో... ఆఫీస్‌లలో సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరిలోని ఎమ్మెల్యే సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత కొంతకాలంగా IT శాఖా అధికారులు ఎమ్మెల్యే పైళ్ళ వ్యాపారం, ఆదాయం మీద ఫోకస్ పెట్టారు. హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్‌లో సోదాలు చేస్తున్నారు. రెండు కంపెనీలకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి భార్య వనిత డైరెక్టర్‌గా ఉన్నారు. మొత్తం 12 చోట్ల ఏకకాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. MLA పైళ్ల శేఖర్ రెడ్డి మీద IT రైడ్స్ తో ఆయన సన్నిహితులు, అనుచరుల్లో ఆందోళన మొదలైంది.

ఉదయం 5 గంటల 30 నిమిషాలకు భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే మామ మాజీ ఎంఆర్ఓ మోహన్ రెడ్డి నివాసానికి వచ్చి IT అధికారులు సోదాలు జరిపారు.కొన్ని పత్రాలు కూడా వారి వెంట తీసుకువెళ్లారు. గత మూడు నాలుగు సంవత్సరాలుగా బినామీ పేర్లతో కాంట్రాక్టర్ పనులు చూస్తున్నట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. బస్వాపూర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు సంబంధించి ప్రభుత్వ స్థలంలో ప్లాట్లను చేసి డెవలప్‌మెంట్‌ చేసి ఇవ్వడానికి 50 కోట్ల కాంట్రాక్టు సొంతంగా బినామీ పేరుతో చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బెంగళూర్, హైదరాబాదు, భువనగిరి, పోచంపల్లి ప్రాంతాల్లో భారీగా రియల్ ఎస్టేట్ వ్యాపారం భువనగిరి పట్టణం, పోచంపల్లి ప్రాంతాల్లో బీటీ రోడ్లు,సిసి రోడ్ల నిర్మాణాన్ని సైతం బినామీ పేర్లతో చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.ఘట్కేసర్ ప్రాంతంలో దాదాపుగా 50 ఎకరాలకు పైగా భూమిని తక్కువ ధరకు తీసుకొని.భారీ లాభాలతో అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. భువనగిరి బైపాస్‌లో దాదాపు 70 ఎకరాల్లో తక్కువ ధరకు భూమి తీసుకుని తక్కువ కాలంలో పది రెట్ల అధిక ధరలకు అమ్మారని ఆరోపణలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, రెసిడెన్షియల్, కమర్షియల్, లిథియం, సోలార్ ఎనర్జీ ప్రాజెక్టులు, సౌత్ ఆఫ్రికాలో తీర్థ గ్రూప్ పేరిట మైనింగ్ వ్యాపారం చేస్తున్నారు. బెంగళూరులో హిల్ ల్యాండ్ టెక్నాలజీస్ కంపెనీ, మెయిన్ ల్యాండ్ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీలు ఉన్నాయి.

2018లో భువనగిరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన పైళ్ల శేఖర్‌ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నారు. ఆయన ఎక్కువగా బెంగళూరు,హైదరాబాదులో నిర్వహిస్తున్న వ్యాపారంపై దృష్టి పెడుతున్నారు. ఆయనపై స్థానిక బీఆర్‌ఎస్ లీడర్లను ప్రజలను పట్టించుకోరనే అపవాదు ఉంది. క్యాడర్‌కు సంబంధించి ఫంక్షన్లలో వేడుకల్లో అసలు హాజరుకారనే ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి పెద్దగా ప్రజా సమస్యలు పట్టవి చెప్పుకుంటారు. 2008 సంవత్సరం నుండి ఆలేరు నియోజకవర్గం నుండి టికెట్ ఆశించిన శేఖర్ రెడ్డి.. బెంగళూరు నుండి నేరుగా వచ్చి ఆలేరు ప్రాంతంలో సాగునీటి సమస్యను తీర్చేందుకు "బెల్ అనే క్రిస్టియన్ సంస్థ" ద్వారా వాటర్ ఫిల్టర్‌లను ఏర్పాటు చేశారు.ఆలేరు నుండి పోటీ చేయాలని అనుకున్నారు.. అప్పుడు ప్రజారాజ్యంలో చేరాలని కూడా ట్రై చేశారు. తర్వాత 2009లో ఆలేరు నుండి కాంగ్రెస్, టిఆర్ఎస్ టికెట్ కోసం ట్రై చేసినా దొరకలేదు. అనుకోకుండా 2014లో భువనగిరి నుండి పైళ్ల పేరు వినిపించింది. TRS పార్టీ తరఫున పోటీ చేసి భువనగిరిలో గెలుపొందారు. 2014, 2018 లలో గెలిచి 9 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story