కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరు : జానారెడ్డి

కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలంతా కనీసం సర్పంచ్‌గా కూడా గెలవలేరు : జానారెడ్డి
హాలియా వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. జానా వెంట జనం.. నాగార్జున సాగర్ జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్.

హాలియా వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. జానా వెంట జనం.. నాగార్జున సాగర్ జనగర్జన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. ఈ సభకు ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీతో సహా కీలక నేతలు హాజరయ్యారు. నాగార్జున సాగర్‌కు తాను ఏం చేశానో అడగడానికి టీఆర్ఎస్ నేతలకు హక్కు లేదన్నారు మాజీమంత్రి, సాగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి. తాను ఏం చేశానో తెలుసుకోవాలంటే కేసీఆర్‌తో వస్తే చూపిస్తానన్నారు. నల్గొండ జిల్లాకు సాగర్ ద్వారా నీళ్లు తీసుకొచ్చానని తెలిపారు.

మరోవైపు నాగార్జున సాగర్‌లో 50వేల మెజార్టీతో గెలవబోతున్నామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సాగర్‌లో బీజేపీ డిపాజిట్ కోల్పోతుందని.. జానారెడ్డి గెలుపుతో రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయన్నారు ఉత్తమ్. 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇక సాగర్‌లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధే జానారెడ్డిని గెలిపిస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. తెలంగాణ ఏర్పాటులో జానారెడ్డి పాత్ర కీలకమని గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ.. అన్యాయంగా తమ ఎమ్మెల్యేలను అధికార పార్టీ చేర్చుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలవాలంటే.. జానారెడ్డిని గెలిపించాలని భట్టి విక్రమార్క కోరారు.

Tags

Read MoreRead Less
Next Story