కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసిన..జూపల్లి

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిసిన..జూపల్లి
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లారు జూపల్లి కృష్ణారావు.

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంటికి వెళ్లారు జూపల్లి కృష్ణారావు. అయితే.. తాను టీ తాగడానికి మాత్రమే కోమటిరెడ్డి ఇంటికి వచ్చానని జూపల్లి పేర్కొన్నారు. ఏ పార్టీలో చేరుతానో ఇంకా డిసైడ్‌ చేసుకోలేదని.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. జూపల్లి పాత మిత్రుడని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌లోకి వస్తే బాగుంటుందని చెప్పానని అన్నారు.

నల్గొండలో 18 లేదా 19వ తేదీల్లో ప్రియాంక గాంధీ సభ ఉంటుందని వెల్లడించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ దూకుడు ఏంటో చూస్తారన్నారు. ఇక.. షర్మిల పార్టీలోకి వస్తే మంచిదేనని పేర్కొన్నారు.చేరికల విషయంలో అధిష్టానందే ఫైనల్‌ అని శ్రీధర్‌బాబు అన్నారు. షర్మిల, డీకే శివకుమార్‌ వ్యక్తిగత పరిచయంతోనే తనను కలిశారని చెప్పారు. క్షేత్ర స్థాయిలో తమ పార్టీ బలం చూసి కేసీఆర్‌ భయపడుతున్నారని శ్రీధర్‌బాబు ఎద్దేవా చేశారు.ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ నేతల్ని జూపల్లి కలిశారు. మల్లు రవితో పాటు పలువురు నేతల ఇళ్లకు వెళ్లారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు. జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story