కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ. 80వేల 321 కోట్లు ఖర్చయింది : కేంద్రం

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.  80వేల 321 కోట్లు ఖర్చయింది : కేంద్రం
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు 80వేల 321 కోట్లు ఖర్చయినట్లు కేంద్రం తెలిపింది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు 80వేల 321 కోట్లు ఖర్చయినట్లు కేంద్రం తెలిపింది. ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే తన సొంత వనరుల ద్వారా నిర్మించిందని పేర్కొంది లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటివరకు 83.7 శాతం పనులు పూర్తయ్యాయని, కాళేశ్వర్‌ ప్రాజెక్టు ద్వారా 18లక్షల 25వేల ఏడు వందల ఎకరాకలు కొత్తగా సాగునీరు, మరో 18 లక్షల 82వేల 970 ఎకరాల స్థిరీకరణ జరుగుతుందని తెలిపారు. 200 టీఎంసీల నీటిని ఎత్తిపోసి సరఫరా చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు ఉద్దేశింపబడిందని, దీని నిర్మాణానికి కేంద్ర జలశక్తి శాఖ సలహామండలి అనుమతి ఉందని స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story