త్రివేణి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

త్రివేణి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

ఎగువన కురుస్తోన్న భారీ వర్షాలకు జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ప్రాణహిత నదిలోని నీరు గోదావరి త్రివేణి సంగమం వద్దకు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో.. 12 మీటర్ల ఎత్తున పుష్కరఘాట్‌ మెట్లను తాకుతూ గోదావరి ప్రవహించడంతో పత్తి, వరి పంటలు నీటమునిగాయి. త్రివేణి సంగమం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. చుట్టు పక్కల గ్రామాలలోని రైతులు,చేపల వేటకు వెళ్లే వారితో పాటు గోదావరిలో స్నానం చేసే భక్తులు సైతం జాగ్రత్తగా ఉండాలని అధికారులు అప్రమత్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story