వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10వేలు : కేసీఆర్

వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.10వేలు :  కేసీఆర్

హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల నష్టపోయిన అందరినీ ఆదుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి 10వేలు ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. మంగళవారం నుంచే వరద సాయం బాధితులకు అందించాలని అధికారుల్ని ఆదేసించారు. ఇందు కోసం మున్సిపల్ శాఖకు 550 కోట్ల రుపాయల్ని విడుదల చేశారు. వర్షాలకు ఇల్లు పూర్తిగా కూలిపోతే వారికి 1 లక్ష రూపాయలు పరిహారం చెల్లిస్తారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇంటికి 50 వేలు ఇస్తారు. అలాగే.. దెబ్బతిన్న రహదారుల్ని యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాలి కేసీఆర్ ఆదేశించారు.

గడిచిన వందేళ్లలో ఎప్పుడూ లేనంతగా భారీవర్షం కురవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కేసీఆర్ అన్నారు. నిరుపేదలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు ఈ వర్షాల వల్ల బాగా ఇబ్బంది పడ్డారని, నిత్యావసరాలు కూడా తడిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ విధి అని కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం కంటే ముఖ్యమైన బాధ్యత ప్రభుత్వానికి మరొకటి లేదని అన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక బృందాలు వెంటనే రంగంలోకి దిగి వరద సాయం అందించాలని CM సూచించారు. సిటీలో 200 నుంచి 250 బృందాలు ఏర్పాటు చేసి అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story