KCR: ఆ నియోజకవర్గాల్లో వంద మందికి చొప్పున దళితబంధు అమలు చేస్తాం: కేసీఆర్

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR: దళితబంధుపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు.

KCR: దళితబంధుపై విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టాలని టీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది. హుజురాబాద్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేస్తామని కేసీఆర్ అన్నారు. మిగిలిన రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున దళితబంధు అమలు చేసి తీరుతామని తెలిపారు.

వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేసేలా రైతుల్లో చైతన్యం తీసుకురావాలని ఎమ్మెల్యేలు, రైతుబంధు సమితి అధ్యక్షులకు కేసీఆర్ సూచించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు, జిల్లా రైతు బంధు కమిటీ ఛైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరయ్యారు. ప్రధానంగా ధాన్యం సేకరణ, ప్రత్యామ్నాయ పంటలు, రైతుబంధుపై సమావేశంలో

చర్చిస్తున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ ద్వందవైఖరి, బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు కేసీఆర్ ఆదేశించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, జిల్లాల్లో పార్టీ కార్యలయాల ప్రారంభోత్సవాలు, పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులపై చర్చించారు. అలాగే రైతులను కాపాడుకోవడంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

అంతుకుముందు.. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లను సీఎం కేసీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు అభివాదం చేసిన ఎమ్మెల్సీలు.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ప్రభుత్వ పదవులన్నీ భర్తీ చేస్తామని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నియోజకవర్గాల్లో అందరూ కష్టపడి పనిచేయాలన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత తనదే అని భరోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story