KCR: ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదన్న కేసీఆర్.. ఎందుకంటే..

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో చాలా అంశాలపై చర్చించారు.

KCR: తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఎల్పీ సమావేశంలో చాలా అంశాలపై చర్చించారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.. వందకు వంద శాతం హుజురాబాద్‌లో గెలుపు మనదేనని టీఆర్‌ఎస్‌ శ్రేణులకు చెప్పారు కేసీఆర్‌.. హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచార సభకు తానే స్వయంగా వస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు.

ఈనెల 26 లేదా 27న కేసీఆర్‌ ప్రచార సభ ఉండే అవకాశం కనిపిస్తోంది. హుజురాబాద్‌లో 13 శాతం ప్లస్‌లో వున్నామని కేసీఆర్‌ చెప్పారు. ఇక దిద్వశాబ్ది వేడుకల్లో భాగంగా నవంబరు 15న వరంగల్‌లో విజయ గర్జన సభపైనా సమావేశంలో చర్చించారు.. విజయ గర్జన సభ కోసం భారీ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతిపక్షాల దిమ్మ తిరిగేలా వరంగల్‌ విజయ గర్జన సభ జరగాలన్నారు కేసీఆర్‌. మనపై మొరిగే కుక్కలు, నక్కల నోళ్లు మూయించాలంటూ ప్రతిపక్షాలను ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలే చేశారు..

వరంగల్‌ సభ ఇన్‌ఛార్జ్‌గా వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నియమించారు.. వరంగల్‌ సభకు ప్రతి ఊరి నుంచి బస్సు రావాలన్నారు.. 22 వేల బస్సుల్లో ప్రజల్ని తరలించాలన్నారు. మరోవైపు తెలంగాణ భవన్‌లో నిత్యం 20 నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు జరిపేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఇక ముందస్తు ఎన్నికల అంశం కూడా ఎల్పీ సమావేశంలో చర్చకు వచ్చింది..

అయితే, ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు.. ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని.. మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని అన్నారు.. రెండేళ్లు టైమున్నందున అన్ని పనులు చేసుకుందామన్నారు.. ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం కేసీఆర్‌ చేశారు..

అలాగే ఈనెల 25న నిర్వహించే ప్లీనరీ ఏర్పాట్లు, పార్టీ సంస్థాగత ఎన్నికలపై కేసీఆర్‌ పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు.. గ్రామ స్థాయి కమిటీలన్నీ అయిపోయినందున, రాష్ట్ర స్థాయి కమిటీలపై దిశానిర్దేశం చేశారు. ప్లీనరీకి నియోజకవర్గం నుంచి 50 మంది రావాలన్నారు.. ప్లీనరీ సభ సంఖ్యను 14వేల నుంచి 6,500 మందికి కుదిస్తున్నట్లు కేసీఆర్‌ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story