KCR Press Meet: బీజేపీ దిక్కుమాలిన చర్యల వల్ల దేశంలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి: కేసీఆర్

KCR Press Meet: బీజేపీ దిక్కుమాలిన చర్యల వల్ల దేశంలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయి: కేసీఆర్
KCR Press Meet: ముఖ్య మంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

KCR Press Meet: ముఖ్య మంత్రి కేసీఆర్ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. జనగామ, యాదాద్రి జిల్లాల్లో జరిగిన బహిరంగ సభల్లో మోదీని, కేంద్ర సర్కారుపై తీవ్రంగా ఆరోపణలు చేసిన కేసీఆర్.. ప్రెస్ మీట్ పెట్టి మరోసారి తమదైన శైలిలో కేంద్రాన్ని కడిగిపారేశారు. ప్రాణం పోయినా రాష్ట్రంలో మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టమని తేల్చిచెప్పారు కేసీఆర్.

విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే రాష్ట్రాలకు అదనంగా 5వేల కోట్లు ఇస్తామన్నారు. వీటిని అమలు చేయకపోవడంతో తెలంగాణకు 25వేల కోట్లు నష్టపోవాల్సి వస్తుందన్నారు. అయినా మీటర్లు పెట్టే ప్రసక్తిలేదని తేల్చిచెప్పారు కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇవ్వడంలేదని.. ఒక్క తెలంగాణా మాత్రమే ఇస్తుందన్నారు. దేశంలో 4లక్షల మెగా వాట్ల పవర్ ఉందని.. 40వేల మెగావాట్ల పవర్ ఉత్పత్తిచేసే స్టేషన్లు ఉన్నాయన్నారు.

బీజేపీ దిక్కుమాలిన చర్యలవల్ల దేశంలో విద్యుత్ కోతలు ఏర్పడ్డాయని కేసీఆర్ దుయ్యబట్టారు. కేంద్రం లోపభూయిష్ట విధానాల వల్లే విద్యుత్ సమస్యలు వస్తున్నాయన్నారు. దేశంలో విద్యుత్ ను ప్రైవేటీకరణ చేసే యోచనలో కేంద్రం ఉందని ఆరోపించారు ముఖ్యమంత్రి కేసీఆర్. పేరుకు మాత్రమే విద్యుత్ సంస్కరణలని.. దానిపేరే ప్రైవేటీకరణ అని ఎద్దేవాచేశారు.

ప్రైవేటు వాడిచేతిల్లోకి వెళితే ఏముంటుందో అర్ధం కాదా అన్నారు. విద్యుత్ ను కార్పొరేట్ గద్దలకు అప్పగించేందుకే ఈ కుటిల నీతి అన్నారు. దాన్నే తాము వ్యతిరేకిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టంచేశారు. దేశంలో అధికారం చేతుల్లో ఉందని.. దేశప్రయోజనాలను తాకట్టుపెడితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ వాళ్లను తరిమి కొట్టకపోతే దేశం నాశనం అవుతుందని ఆరోపించారు సీఎం కేసీఆర్.

ఇవ్వన్నీ అక్కసుతో అనడంలేదన్నారు. బీజేపీ చేసే సంస్కరణలు దేశానికి మంచివి కావని వెల్లడించారు. బీజేపీ తీసుకొస్తున్న విధానాలతో దేశంలో ఆర్ధిక వ్యవస్థ చిన్నా భిన్నమైందన్నారు. మోదీ విధానాల వల్ల దేశంలో తీవ్ర ఆర్ధిక వ్యవస్థ ఏర్పడిందన్నారు. ధనవంతులు మరింత ధనవంతులైతే.. పేదలు మరింత నిరుపేదలుగా మిగులుతున్నారని ఆరోపించారు.

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఇప్పటివరకు దేశంలో 16 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయని.. ఇది తన మాటలు కావన్నారు. ఇది కేంద్రం ఇచ్చిన NSO రిపోర్టు అన్నారు. ప్రధాని మోదీ చెప్పెవన్నీ అబద్దాలే అన్నారు సీఎం కేసీఆర్.. మిషన్‌ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని పిలిస్తే బహిరంగ సభలో పచ్చి అబద్దాలు చెప్పారని గుర్తుచేశారు. యూనిట్‌కు రూ.11 చొప్పున కొని రూ.1.10కే రాష్ట్రాలకు ఇచ్చినట్టు చెప్పారు.

కేంద్రం ఎన్నూడూ రూ.1.10కు ఏ రాష్ట్రానికి విద్యుత్‌ ఇవ్వలేదు. కేంద్రం అబద్దాలపై చర్చకు రావాలన్నా.. ఏ బీజేపీ నేత ముందుకు రావడంలేదన్నారు. రఫేల్‌ జెట్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగిందని ఆరోపించారు సీఎం కేసీాఆర్. వేల కోట్లు మింగారని దుయ్యబట్టారు. మనకంటే చౌకగా ఇండోనేషియా రఫేల్‌ విమానాలు కొనుగోలుచేసిందన్నారు. బీజేపీ అవినీతి గురించి దిల్లీలో పంచాయితీ పెడతానని..ఆ పార్టీ నేతలకు దమ్ముంటే వీటిపై మాట్లాడాలని సవాల్ విసిరారు.

తాను బడ్జెట్‌ను సరిగా అర్థం చేసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అనడం విడ్డూరంగా ఉందన్నారు. 34వేల,900 కోట్ల ఎరువుల సబ్సిడి తగ్గించింది అబద్దమా? కాదా అన్నారు. ఉపాధి హామీ పథకానికి రూ.25వేల కోట్ల తగ్గింపు నిజం కాదాఅని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిన విషయం వాస్తవం కాదా?' అని సీఎం కేసీఆర్‌ కిషన్ రెడ్డిని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story