KCR: మేము రూ.3 లక్షలు ఇస్తాం.. మీరు రూ.25 లక్షలు ఇవ్వండి.. మోదీకి కేసీఆర్ డిమాండ్..

KCR (tv5news.in)

KCR (tv5news.in)

KCR: మేం ధర్నా చేసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు.

KCR: ఈరోజు (శనివారం) జరిగిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ మాట్లాడిన పాయింట్స్ ఇవే..

  • మేం ధర్నా చేసిన రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామన్నారు.
  • చివరి ప్రయత్నంగా రేపు ఢిల్లీ వెళ్తున్నాం.
  • అవసరమైతే ప్రధానిని కూడా కలిసి డిమాండ్ చేద్దామనుకున్నాం.
  • ఏదో ఒకటి తేల్చకపోతే రైతులు కన్ఫ్యూజన్‌లో ఉంటారు.
  • అనవసరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది.
  • ముందే చేప్తే వేరే పంట వేసుకునే వాళ్లం కదా అని రైతులంటారు.
  • మొన్న వాళ్లిచ్చిన స్టేట్‌మెంట్‌ నిజమా అబద్ధమా తెలియదు.. గాలి వార్తయితే వచ్చింది.
  • వార్త నిజమా కాదా అనేది తేల్చుకునేందుకే ఢిల్లీ వెళ్తున్నాం.
  • ఢిల్లీలో సమావేశం తర్వాత రైతులకు వివరాలు వెల్లడిస్తాం.
  • ప్రకృతి కలిగించిన ఇబ్బందులు తట్టుకుని రైతులు అద్భుతమైన విజయం సాధించారు.
  • రైతుల మీద పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలి.
  • దిశ అనే అమ్మాయి సంఘీభావం తెలిపితే ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు.
  • ఇలాంటి కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలని ప్రధానిని డిమాండ్ చేస్తున్నాం.
  • పోరాటంలో 750 మంది వరకు రైతులు ఆత్మార్పణం చేసుకున్నారు.
  • చనిపోయిన వారందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నాం.
  • రైతు ఆందోళనలో చనిపోయిన వారందరికీ రూ.3 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాం.
  • అవసరమైతే నేను కూడా వెళ్లి రైతు కుటుంబాలను పరామర్శిస్తా.
  • ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలు పెట్టినా తట్టుకుని పోరాడారు.
  • సారీ చెప్పి కేంద్రం చేతులు దులుపుకోవద్దు.. రూ.25 లక్షలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి.
  • కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకురావాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం.
  • రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో దీని కోసం పోరాడతాం.
  • వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో కనీస మద్దతు ధర చట్టం తీసుకురావాలి.
  • కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం.
  • కరోనాపై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లోనూ ప్రధానితో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పా.

Tags

Read MoreRead Less
Next Story