KingFisher: కలెక్టర్ గారు.. కింగ్‌ఫిషర్‌ అమ్మట్లేదు..!

KingFisher: కలెక్టర్ గారు.. కింగ్‌ఫిషర్‌ అమ్మట్లేదు..!
ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన వ్యక్తి

బ్రాండ్ విషయంలో మద్యం ప్రియులు ఏమాత్రం రాజీపడరనే విషయం మరోసారి రుజువైంది.కింగ్‌ఫిషర్ బీరు కోసం ఏకంగా కలెక్టరుకు కంప్లైంట్ చేశాడు ఓ వ్యక్తి. జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్‌ అయ్యారని,కింగ్ ఫిషర్ బీరును అమ్మడం లేదంటూ ఏకంగా కలెక్టర్‌ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లతకు ఫిర్యాదు చేశాడు జగిత్యాల వాసి రాజేష్.లిక్కర్‌తో అనారోగ్య సమస్యలు వస్తున్నాయంటూ కింగ్‌ ఫిషర్‌బీర్లను అందుబాటులోకి తేవాలంటూ వినతి పత్రం అందజేశాడు.

Tags

Read MoreRead Less
Next Story