Top

మేయర్‌ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది: కిషన్‌రెడ్డి

మేయర్‌ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుంది: కిషన్‌రెడ్డి
X

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేయర్‌ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని అన్నారు. అంబర్‌పేట్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అంబర్‌పేట్‌, బాగ్‌ అంబర్‌పేట్‌ డివిజన్‌లు, ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని హిమాయత్‌నగర్‌ డివిజన్‌లలో పార్టీ ఆఫీసుల్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. గత ఎన్నికల్లో డబుల్‌ బెడ్‌ రూమ్‌ సహా పలు హామీలతో టీఆర్‌ఎస్‌ గెలిచిందని కిషన్‌రెడ్డి అన్నారు. హామీల అమలులో టీఆర్‌ఎస్‌ వైఫల్యాన్ని ప్రజలకు వివరిస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీని యువత గెలిపించబోతున్నారని చెప్పారు.


Next Story

RELATED STORIES