Kollur: ఆసియాలోనే అతి పెద్ద టౌన్‌షిప్‌.. 144 ఎకరాలు, 15వేల 640 ఇళ్లు, రూ. 1350 కోట్ల వ్యయం..

Kollur: ఆసియాలోనే అతి పెద్ద టౌన్‌షిప్‌.. 144 ఎకరాలు, 15వేల 640 ఇళ్లు, రూ. 1350 కోట్ల వ్యయం..
Kollur: కొల్లూరులో 144 ఎకరాల్లో డబుల్ బెడ్ రూంల నిర్మాణం జరిగింది.

Kollur: కొల్లూరులో 144 ఎకరాల్లో డబుల్ బెడ్ రూంల నిర్మాణం జరిగింది. 1350 కోట్ల భారీ బడ్జెట్ తో ఏకంగా 15వేల 640 ఇళ్లు కట్టారు. దీంతో దేశంలోనే ప్రభుత్వపరంగా నిర్మించిన అతిపెద్ద మోడల్ కాలనీగా కొల్లూర్ ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ డబుల్ బెడ్ రూం ఇళ్లను పేదలకు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం.

మొత్తం ఒకేచోట 114 బ్లాక్‌లలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టారు.ఒక్కో బ్లాక్ కు రెండు లిఫ్టు లు ఏర్పాటు చేశారు. అగ్నిప్రమాదాల నియంత్రణకు ప్రతి బ్లాక్ లో ఫైర్ సేఫ్టీ ఉంచారు. కాలనీలో మొత్తం పదమూడన్నర కిలోమీటర్ల రోడ్లు వేశారు. అండర్ గ్రౌండ్ లో విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేశారు.క్షణం కూడా కరెంట్ పోకుండా ప్రతి బ్లాక్ కు జనరేటర్ పెట్టారు.

వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశారు. కాలనీ చుట్టూ హైమస్త్ లైటింగ్ పెట్టారు. 15వేల 640 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో దాదాపు లక్షమంది నివాసం ఉండనున్నారు. వీరి అవసరాల కోసం 3 షాపింగ్ కాంప్లెక్స్‌లలో 118 షాపులు ఏర్పాటు చేశారు. అంతేకాదు పంక్షన్లు, పెళ్ళీలలాంటి శుభకార్యాలు చేసుకునేందుకు .. ఓ ఫంక్షన్ హాల్ కూడా నిర్మించారు.

కొల్లూర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉండే ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండేందుకు ఎక్కడ ఖాళీ స్థలం ఉన్నా ఓపెన్ పార్కు లను ఏర్పాటు చేశారు. వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ లు, ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ ఇండోర్ స్పోర్ట్ కాంప్లెక్స్, ఓపెన్ స్పోర్ట్స్ ఏరియా, మల్టీ పర్పస్ గ్రౌండ్, హంపి థియేటర్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం , బతుకమ్మ ఘాట్ లాంటివి నిర్మించారు.

మురుగు నీటిని బయటకు పంపించకుండా రీసైక్లింగ్ చేసి ఆ నీటిని శుద్ధి చేసి మొక్కలకు వాడేందుకు సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ఆధునిక వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు నిర్మించారు. ప్లే స్కూల్, అంగన్ వాడీ సెంటర్,బస్తీ దవాఖాన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు కూడా నిర్మించారు. ఒక్కో డబుల్ బెడ్ రూమ్ ను 560 స్క్వేర్ ఫీట్లలో నిర్మించారు.

హాల్, రెండు బెడ్ రూమ్ లు, రెండు టాయిలెట్లు , కిచన్ , వాష్ ఏరియా ఏర్పాటు చేశారు. కొల్లూరు డబుల్ బెడ్ రూం కాలనీలో ప్రాథమిక ఉన్నత పాఠశాల, బస్ టెర్మినల్, బస్ స్టాప్, పోలీస్ స్టేషన్, ఫైర్ స్టేషన్, మిల్క్ బూత్ లు, పెట్రోల్ బంకులు, పోస్టాఫీసు, ఏటీఎంలు , బ్యాంక్ ఏర్పాటు కు చర్యలు చేపట్టారు. లేటైనా.. అత్యాధునిక వసతులతో కొల్లూర్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు అందరి మన్ననలు పొందుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story