మా ఊరు మహాలక్ష్మి పేరుతో ప్రతి ఆడపిల్లకు అండగా నిలుస్తున్న గ్రామం..

మా ఊరు మహాలక్ష్మి పేరుతో ప్రతి ఆడపిల్లకు అండగా నిలుస్తున్న గ్రామం..
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది గల్ఫ్ బాట పట్టారు గ్రామంలోని కొంత మంది. అలా ఒక్క కొండాయి పల్లి నుంచి 43 మంది

అమ్మాయి పుట్టిందంటే ఆ ఇంట ఆనందం వెల్లి విరియాలి కానీ.. తల్లిదండ్రులు ఆ బిడ్డను భారంగా భావించకూడదు అని చిన్న గ్రామం అయినా పెద్ద నిర్ణయం తీసుకుంది. చుట్టు పక్కల గ్రామాల వారికి ఆదర్శంగా నిలుస్తోంది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండాయి పల్లి అనే ఓ చిన్న గ్రామం. అక్కడి జనాభా దాదాపు 1360 మంది మాత్రమే. మొత్తం 300 కుటుంబాలు ఉన్నాయి.

ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడుతూ జీవనం సాగిస్తుంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేక మంది గల్ఫ్ బాట పట్టారు గ్రామంలోని కొంత మంది. అలా ఒక్క కొండాయి పల్లి నుంచి 43 మంది బతుకుదెరువు కోసం గల్ఫ్ బాట పట్టారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వారంతా తమ గ్రామ అభివృద్ధికి పాటు పడాలని నిర్ణయించుకున్నారు.

గల్ఫ్‌లో స్థిరపడిన కొండాయిపల్లి వాసి రెండ్ల శ్రీనివాస్ వారి మిత్రులతో కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు దానికి మా వూరి మహాలక్ష్మి అని పేరు పెట్టారు. గ్రామంలో ఎవరికి ఆడపిల్ల పుట్టినా ఆ పాప పేరు మీద 5వేల రూపాయలు ఫిక్స్‌డ్ చేయాలని నిర్ణయించారు. 2018లో ప్రారంభించిన ఈ కార్యక్రమం రానున్న రోజుల్లో గరిష్టం 50 వేలు డిపాజిట్ చేయాలని అనుకుంటున్నారు.

దాంతో ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆర్థికభద్రత కలుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. గ్రామంలో పుట్టిన దాదాపు 40 మంది ఆడపిల్లలకు ట్రస్ట్ ద్వారా 5వేలు, వారి తల్లిదండ్రుల ద్వారా 5వేలు.. మొత్తం కలిపి 10 వేలు పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేసి ఆ పాస్ బుక్కులను వారి తల్లిదండ్రులకు ఇస్తున్నారు. కొండాయపల్లి గ్రామస్తులు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక్ అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story