KTR: కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌..

KTR: కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌..
KTR: తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ.. తెలంగాణను టార్గెట్‌ చేశారు.

KTR: పెట్రో ధరల పెంపుపై.. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తునే ఉన్నాయి. ఈ వ్యాఖ్యల్ని బీజేపీయేతర రాష్ట్రాలు తిప్పుకొడుతున్నాయి. తాజాగా కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ.. తెలంగాణను టార్గెట్‌ చేశారు. తెలంగాణ స‌ర్కారు పెట్రోలు, డీజిల్‌పై అత్యధిక వ్యాట్ వ‌సూలు చేస్తోందని, 2014 నుంచి 2021 వరకు ₹56,020 కోట్ల వ్యాట్‌గా వసూలు చేసింద‌ంటూ ట్వీట్‌ చేశారు హ‌ర్దీప్‌సింగ్‌పూరి. దీనిపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి పెట్రోల్‌ ఉత్పత్తులపై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్‌ పెంచలేదని అన్నారు మంత్రి కేటీఆర్‌. అలాంటప్పుడు రాష్ట్రం పెట్రో పన్నులను పెంచిందనే మాటే ఉత్పన్నం కాదన్నారు.2014లో క్రూడాయిల్‌ ధర 105 డాలర్లు ఉన్న సమయంలో పెట్రోల్‌ రేటు 70 రూపాయలు ఉంటే.. ఇప్పుడు కూడా అదే ధరకు క్రూడాయిల్ దొరుకుతున్నప్పుడు 120 రూపాయలకుపైగా పెట్రోల్‌ రేట్లు పెరిగిన అంశంపై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు..

ఈ పెరుగుదలకు కారణం కేంద్రంలో ఉన్న నాన్‌ పెర్ఫార్మెన్స్‌ అసెట్స్‌, మీ ప్రభుత్వం పెంచిన ఎక్సైజ్‌ డ్యూటీలు, సెస్సులు కాదా అని నిలదీశారు కేటీఆర్‌. ఇతర రాష్ట్రాలకు నీతులు చెప్పే మీరు కేంద్రం పెంచిన సెస్సులను పూర్తిగా రద్దు చేస్తే 70 రూపాయలకు పెట్రోల్‌, 60 రూపాయలకు డీజిల్‌ భారతదేశ ప్రజలకు అందించే వీలుందని.. ఈ విషయాన్ని మీ ప్రధాని నరేంద్ర మోదీకి చెబితే మంచిదంటూ కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీకి ట్వీట్లతో ఘాటెక్కించారు..

బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 26 లక్షల కోట్ల రూపాయలు సెస్సుల పేరుతో ప్రజల నుంచి గుంజింది వాస్తవం కాదా అని నిలదీశారు మంత్రి కేటీఆర్‌. మొత్తానికి.. పెట్రోల ధరల పెంపుపై, కేంద్రం ఆరోపణల్ని తిప్పికొడుతోంది తెలంగాణ సర్కారు. ఇందులో రాష్ట్రాల వాటా ఏమి లేదని,. కేంద్రం వల్లే.. పెట్రో ధరలు పెరుగుతున్నాయన్నారు.

Tags

Read MoreRead Less
Next Story