KTR : ఈ 4 ఆప్షన్లలో ప్రధాని మోదీని ఏమని పిలుస్తారు..? : కేటీఆర్

KTR : ఈ 4 ఆప్షన్లలో ప్రధాని మోదీని ఏమని పిలుస్తారు..? : కేటీఆర్
KTR : ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మరోసారి ట్వీటాస్త్రం సంధించారు. ఈసారి ద్రవోల్బణం, చొరబాటుదారుల అంశాలపై మోదీని టార్గెట్ చేశారు

KTR : ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్ మరోసారి ట్వీటాస్త్రం సంధించారు. ఈసారి ద్రవోల్బణం, చొరబాటుదారుల అంశాలపై మోదీని టార్గెట్ చేశారు. దేశంలో ద్రవ్యోల్బణాన్ని, చొరబాటుదారులను నియంత్రించలేని ప్రధానిని మీరేమంటారు? అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని.. శాటిలైట్ ఫొటోలతో జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇలాంటి ప్రధానిని ఏమని పిలుస్తారు? అంటూ ఆప్షన్లు కూడా ఇచ్చారు కేటీఆర్. అంతేకాదు అన్‌పార్లమెంటరీ పదాలు తొలగించబడ్డాయి అంటూ ప్రధాని మోదీపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.

Tags

Read MoreRead Less
Next Story