Top

ఆస్తుల న‌మోదుకు ఎవ‌రికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు : కేటీఆర్

ఆస్తుల న‌మోదుకు ఎవ‌రికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దు : కేటీఆర్
X

తెలంగాణ‌లో భూ వివాదాల‌ను శాశ్వతంగా ప‌రిష్కారించాల‌నే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త రెవెన్యూ చ‌ట్టాన్ని తీసుకువచ్చిందన్నారు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. ప్రజల సమస్యలను పరిష్కరించి, వారి ఆస్తులపై హక్కులు కల్పించాలనే కొత్త చట్టం తెచ్చామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని రెవెన్యూ సమస్యలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. స‌మీక్ష స‌మావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ చీఫ్ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి , ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని శాసనసభ్యులు పాల్గొన్నారు.

ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన లేదన్నారు కేటీఆర్. ప్రజలు ఆస్తుల న‌మోదుకు ద‌ళారుల‌ను న‌మ్మొద్దని... ఎవ‌రికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని మంత్రి సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే కేటీఆర్ వెల్లడించారు. దేవాదాయ, వక్ఫ్‌, పరిశ్రమలు తదితర భూముల్లో వివాదాల వల్ల యాజమాన్యపు హక్కు లేని భూముల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జీవో నంబర్‌ 58, 59 ద్వారా ప్రభుత్వ భూములు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను మాత్రమే రెగ్యులరైజ్‌ చేస్తామన్నారు.

Next Story

RELATED STORIES