హైదరాబాద్ లో భారీ వర్షాలపై కేటీఆర్‌ సమీక్ష

హైదరాబాద్ లో భారీ వర్షాలపై కేటీఆర్‌ సమీక్ష
హైదరాబాద్ భారీ వర్షాలపై కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పురపాలకశాఖ..

హైదరాబాద్ భారీ వర్షాలపై కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా దిశానిర్దేశం చేశారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, పురపాలకశాఖ అధికారులు, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీలో అధికారులంతా క్షేత్రస్థాయిలోనే ఉండాలని కేటీఆర్‌ ఆదేశించారు. వరద బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఆహారం, దుప్పట్లు, వైద్య సదుపాయం కల్పించాలని చెప్పారు. క్యాంపుల్లో బస్తీ దవాఖానా వైద్యులు పని చేయాలని సూచించారు. సిటీలో విద్యుత్ సరఫరా నిలిపివేసిన చోట పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మూసీ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. రోడ్లపై పేరుకుపోయిన నీటి తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు. ఓపెన్ నాలల వద్ద ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్థానిక మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర సిబ్బంది పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. వాతావరణ శాఖతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story