Top

భూవివాదం కేసులో ఆర్ముర్ కోర్టు సంచలన తీర్పు

భూవివాదం కేసులో ఆర్ముర్ కోర్టు సంచలన తీర్పు
X

ఓ భూవివాదం కేసులో ఆర్ముర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భూవివాదం కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ శైలజ, రెవన్యూ సర్వేయర్ రాజు, ఎస్.హెచ్. ఒ రాఘవేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సుల్తానా అనే బాధితురాలు.. తన భూమిని వేరే వ్యక్తి కబ్జా చేశాడని చెప్పినా ఈ ముగ్గురు అధికారులు పట్టించుకోలేదు.. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బాధితురాలు సుల్తానా.. ఈ కేసును విచారించిన కోర్టు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురిపై చర్యలకు ఆదేశాలు జారీ చేసింది.

Next Story

RELATED STORIES