Congress: హుజురాబాద్‌లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది..?పార్టీ సమీక్షలో..

Congress (tv5news.in)

Congress (tv5news.in)

Congress: హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం టీ-కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది.

Congress: హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితం టీ-కాంగ్రెస్ నేతల మధ్య చిచ్చు పెట్టింది. ఇవాళ హుజురాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి 3 వేల ఓట్లు మాత్రమే రావడంపై రివ్యూ నిర్వహించింది AICC. టీ-కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు AICC జనరల్ సెక్రటరీ కే.సీ.వేణుగోపాల్. ఈ సమావేశానికి అభ్యర్థి బల్మూర్ వెంకట్‌తో పాటు 13 మంది కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు.

హుజురాబాద్ ఓటమిపై నివేదికను KC వేణుగోపాల్ కు ఇచ్చారు అభ్యర్థి వెంకట్. రివ్యూ సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు టీ-కాంగ్రెస్ నేతలు. తానూ పీసీసీగా కొత్తగా వచ్చానని, హుజురాబాద్ ఉపఎన్నిక బాధ్యతలు అందరికి అప్పగించానన్నారు రేవంత్ రెడ్డి. వాళ్లు చెప్పినట్లే ముందుకు వెళ్లానన్నారు. ప్రచారం చేసినప్పటికీ ప్రజలే ఓట్లు వేయలేదన్నారు ఎమ్మెల్యేలు సీతక్క, శ్రీధర్ బాబు, భట్టి.

ఈటలను పార్టీలో చేర్చుకుని ఉంటే బాగుండేదన్నారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. ఈటల పార్టీలోకి రాకుండా కొందరు అడ్డుపడ్డారని AICC దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివరణపై స్పందించిన కేసీ వేణుగోపాల్ భట్టిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈటలను పార్టీలో చేర్చుకోవద్దని భట్టినే చెప్పారని, ఇప్పుడు ఇతరులపై నిందలు వేస్తున్నారని సీరియస్ అయినట్లు సమాచారం.

సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పొన్నం ప్రభాకర్ సీరియస్ కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి పార్టీ విడిచివెళ్లేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకరించారని పొన్నం ఆరోపించారు. కౌశిక్‌రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డే ఎమ్మెల్సీ పదవి ఇప్పించారని పొన్నం ఆరోపించారు. హుజురాబాద్ తో పాటు దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు, GHMC ఎన్నికలపైనా రివ్యూ జరగాలని పొన్నం కోరినట్లు తెలుస్తోంది.

పార్టీ అభ్యర్థి ఎంపికపైనా సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి పార్టీ వీడి 4 నెలలు దాటిన అభ్యర్థిని ఎందుకు ఎంపిక చేయలేదో చెప్పాలన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బల్మూర్ వెంకట్ పోటీ చేస్తానని అప్లికేషన్ పెట్టుకోకున్నా.. టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు సీనియర్ లీడర్ వి.హనుమంతరావు. ఎవరు రిఫర్ చేస్తే టికెట్ ఇచ్చారో చెప్పాలన్నారు.

రాహుల్‌గాంధీకి కొండా సురేఖ రాసిన లేఖను కే.సీ.వేణుగోపాల్‌కు ఇచ్చారు వీ.హెచ్. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీ వేణుగోపాల్ కు లేఖ రాసినట్లు తెలుస్తోంది. రేవంత్ సొంత ఇమేజ్ పెంచుకోవడానికే ప్రయత్నిస్తున్నాడని.. పార్టీ కోసం చేయట్లేదని ఆరోపించినట్లు తెలుస్తోంది.నేతల అభిప్రాయాలు నోట్ చేసుకున్న కేసీ వేణుగోపాల్.. పార్టీ చీఫ్ సోనియాగాంధీకి నివేదిక ఇవ్వనున్నారు. నేతలంతా సమన్వయంగా సాగాలని, పార్టీ కోసం కృషి చేయాలని వేణుగోపాల్ సూచినట్లు తెలుస్తోంది

Tags

Read MoreRead Less
Next Story