Top

ప్రమాదవశాత్తు బావిలో పడ్డ చిరుత!

నిన్న రాత్రి ఆహారం కోసం చిరుత పులి ఆ గ్రామానికి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాల పక్కన దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న వ్యవసాయ బావిలో చిరుత పడింది.

ప్రమాదవశాత్తు బావిలో పడ్డ చిరుత!
X

రాజన్న సిరిసిల్లా జిల్లాలో ప్రమాదవశాత్తు చిరుత బావిలో పడింది. బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చుట్టూ అటవీ ప్రాంతం ఉండడంతో నిన్న రాత్రి ఆహారం కోసం చిరుత పులి ఆ గ్రామానికి వచ్చింది. ఆ సమయంలో ప్రభుత్వ పాఠశాల పక్కన దాదాపు 40 అడుగుల లోతులో ఉన్న వ్యవసాయ బావిలో చిరుత పడింది. ఇవాళ ఉదయం పొలానికి నీళ్లు పెట్టడానికి వచ్చిన రైతు బావిలో పడ్డ చిరుత పులిని గమనించాడు. దీంతో చిరుత విషయం బయట పడింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు బావిలో పడ్డ చిరుతను తీయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆ ప్రయత్నాలు సఫలం కావడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

Next Story

RELATED STORIES