కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట ఇంటిపై 30 మంది దాడి

కులాంతర వివాహం చేసుకున్న ప్రేమజంట ఇంటిపై 30 మంది దాడి
కులాంతర వివాహం చేసుకోవడమే ఆ ప్రేమికులు చేసిన పాపం. ఆ జంటపై అమ్మాయి తరపు బంధువులు దాడికి పాల్సడ్డారు

సూర్యాపేట జిల్లా మునగాల మండలం బరాఖత్‌ గూడెం గ్రామంలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంటపై అమ్మాయి తరపు బంధువులు దాడికి పాల్సడ్డారు. కులాంతర వివాహం చేసుకోవడమే ఆ ప్రేమికులు చేసిన పాపం. బర్కత్‌గూడెంలో నివాసముంటోన్న యువకుడు గోపి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గరిడేపల్లి కళ్యాణి డిగ్రీ చదువుకుంటోంది. 3 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఐతే.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వీరు ఇంట్లోకి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ కారణంగానే తమ ఇంటిపై దాడి జరిగిందని కల్యాణి ఆందోళన వ్యక్తం చేస్తోంది.

మార్చి 1వ తేదీన గోపి-కల్యాణి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మునగాల పోలీసు స్టేషన్‌కు వెళ్లి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇరువురి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఐతే అమ్మాయి తరపువాళ్లు ఈ వివాహాన్ని ససేమిరా అంగీకరించేది లేదని చెప్పారు. దీంతో.. పోలీసులు వారిని హెచ్చరించి పంపించారు. ఇక్కడితో వివాదం ముగిసిందని అనుకుంటుండగా.. రాత్రి తమ ఇంటిపై దాడి జరగడంతో వీళ్లు భయపడిపోయారు. తమ ఇంటిపై రాళ్లదాడి చేసి, కత్తులు, గొడ్డళ్లతో బెదిరించారని కల్యాణి చెప్తోంది. తమకు రక్షణ కల్పించాలని కోరుతోంది.


Tags

Read MoreRead Less
Next Story