Yadadri : యాదాద్రిలో ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ

Yadadri : యాదాద్రిలో ఈ నెల 28న మహాకుంభ సంప్రోక్షణ
Yadadri : యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈనెల 28 న ఉదయం 11గంటల 55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయి.

Yadadri : కోట్లాది మంది భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న..యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈనెల 28 న ఉదయం 11గంటల 55 నిమిషాలకు మహకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయి. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని ఈవో గీత తెలిపారు. పూర్వాంగ భూతంగా ఈ నెల 21 నుంచి.. 7 రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహణ ఉంటుందని తెలిపారు. అలాగే.. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువును నిర్వహించనున్నారు.

ఆలయ గోపురాల కలశాలఅన్నింటికి సంప్రోక్షణ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. 21 నుండి 28 వరకు రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ నెల 28న సంప్రోక్షణ.. అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా ప్రదానాలయంలోకి తరలిస్తారు. అన్ని పూజలు పూర్తి అయిన తర్వాతే భక్తులకు దర్శనాలకు అనుమతి ఇస్తామన్నారు ఈవో గీత.

ఇప్పటికే కల్యాణ కట్ట, పుష్కరిణిలను అందుబాటులోకి తెచ్చారు. దేవాదాయ శాఖ , జిల్లా యంత్రాంగం ,ఇతర అన్ని శాఖలు సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బాలాలయంలో యాగ శాల ఏర్పాట్లు శనివారంతో పూర్తి కానున్నాయి. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడుకి జియో ట్యాగింగ్ చేయనున్నారు. దీంతో రోజు ఎంత మంది దర్శనాలు చేసుకుంటున్నారన్నది పక్కాగా తెలియనుంది.

Tags

Read MoreRead Less
Next Story