Mahabubnagar : మహబూబ్​నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి

Mahabubnagar : మహబూబ్​నగర్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి
గెలుపు దిశగా పార్టీల కసరత్తులు

కసిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన మహబూబ్‌నర్‌ స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్, భారాస అభ్యర్ధులు తీవ్రంగా పోటీపడుతున్నారు. అధిక ఓటర్లు భారాసకు చెందినప్రజాప్రతినిధులే ఉన్నా.. ఇటీవల కాంగ్రెస్‌లోకి వలసలు పెరగడంతో పార్టీల బలాబలాలు మారిపోతున్నాయి. కాంగ్రెస్, భారాసయేతర ప్రజాప్రతినిధులు, స్వతంత్రుల ఓట్లు అభ్యర్ధులకు కీలకం కానున్నాయి. ఎక్కువ మందిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికల్లో ఎవరు విజయసాధిస్తారనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తిచర్చ సాగుతోంది. MLC పదవిని దక్కించుకునేందుకు..... కాంగ్రెస్ అభ్యర్ధి మన్నె జీవన్‌రెడ్డి, భారాస అభ్యర్ధి నవీన్‌కుమార్ రెడ్డి, స్వతంత్రఅభ్యర్ధి సుదర్శన్‌గౌడ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇద్దరు MPలు 14మంది MLAలు, ముగ్గురు MLCలు, 888 మంది MPTC, 83మంది ZPTCలు 449 మంది కౌన్సిలర్లు కలిపి జిల్లాలో మొత్తం1,439 మంది ఓటర్లున్నారు. ఈనెల28న జరిగే పోలింగ్‌లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన 10 పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. అయితే.. ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారానే అంశం ఉత్కంఠ రేపుతోంది.

2021 ఎన్నికల్లో ఇతరపార్టీల అభ్యర్ధులెవరూ పోటీచేయకపోవడంతో భారాస అభ్యర్ధులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కానీ ప్రస్తుతం పరిస్థితిమారింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఎన్నికల ముందే కొంందరు ప్రజాప్రతినిధులు భారాసనివీడి కాంగ్రెస్‌లోచేరి పార్టీ గెలుపుకోసం కృషిచేశారు. గద్వాల ZP ఛైర్మన్ సరిత భారాస నుంచి హస్తం పార్టీలోచేరి....గద్వాల ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీచేసిఓడిపోయారు. ఎన్నికల ముందే నారాయణపేట జెడ్పీ చైర్‌పర్సన్ వనజ సహా పలుచోట్ల MPTC, ZPTCలు భారాసని వీడి హస్తంపార్టీలోచేరారు. మహబూబ్‌నగర్ ZP ఛైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్గు లాబీపార్టీని వీడి కాంగ్రెస్‌ గూటికి చేరారు. మహబూబ్‌నగర్ పురపాలికలో భారాస కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరి ఏకంగా ఛైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. గద్వాల మున్సిపల్ ఛైర్మన్ సహా 16మంది కౌన్సిలర్లు అధికార పార్టీలో చేరారు. వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు హస్తంపార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలం క్రమంగా పెరుగుతోంది.

ఎందరు పార్టీనివీడినా భారాస మాత్రం గెలుపుపై ధీమాతో ఉంది. వెయ్యిమందికిపైగా ప్రజాప్రతినిధులు భారాసకి చెందినవారే ఉన్నారు. కొందరు పార్టీని వీడినంత మాత్రాన గెలుపుపై ప్రభావం చూపదని భావిస్తున్నారు. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. నవీన్‌కుమార్‌రెడ్డి గెలుపు కోసం భారాస MLA బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, MLC చల్లావెంకట్రాంరెడ్డి ఒక్కోఓటరును కలుస్తూ మద్దతివ్వాలని కోరుతున్నారు.

కాంగ్రెస్, భారాస ప్రజాప్రతినిధులు పోగా.. ఇతర పార్టీలప్రజాప్రతినిధులకు ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది. వారిని తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్ధులు నానాతంటాలు పడుతున్నారు. ఓటర్లలో 888 మంది MPTCలే కావడంతో వారిని ప్రసన్నానికి అభ్యర్ధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. MLC ఎన్నికల్లో ప్రాధాన్యత ఓటు ఉండటంతో.......... తమకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story