కన్న కూతురినే అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు

కన్న కూతురినే అమ్మకానికి పెట్టిన తల్లిదండ్రులు
17 ఏళ్ల తమ రెండో కూతురికి వెళ్లి చేయాలనుకున్నారు. అంతలో.. వీరికి షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయమైంది.

కూతురికి పెళ్లి చేసే స్థోమతలేక ఏకంగా కన్నకూతురినే అమ్మకానికి పెట్టిన దారుణ ఘటన పాలమూరు జిల్లాలో వెలుగుచూసింది. నవాబ్‌పేట మండలం హాజిలాపూర్‌ గ్రామ పరిధిలోని గాలోనికుంటకు చెందిన వాలమ్మ, రవినాయక్‌ దంపతులకు నలుగురు సంతానం. హైదరాబాద్‌లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

17 ఏళ్ల తమ రెండో కూతురికి వెళ్లి చేయాలనుకున్నారు. అంతలో.. వీరికి షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తితో పరిచయమైంది. అయితే రవినాయక్‌ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆ వ్యక్తిని బాలికను అమ్మేందుకు స్కెచ్‌ వేశాడు. రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి చేద్దామంటూ ఆ దంపతులను ఒప్పించాడు. దీనికోసం పెళ్లి కొడుకు నుంచి 3 లక్షలు ఇప్పిస్తానని.. ఒప్పందం కుదుర్చుకున్నాడు.

బాలికను అప్పగించేందుకు.. రవి నాయక్‌ దంపతులు.. నవాబ్‌పేట నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. అంతలోనే.. దుబాయిలో ఉంటున్న బాలిక బాబాయికి విషయంలో తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ దంపతులను అడ్డుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో.. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. ఆమెను మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌ హోంకు తరలించారు. ఈ మొత్తం ఘటనలో..మధ్యవర్తులు ఎవరు.. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందో విచారణ జరుపుతున్నామని తెలిపారు పోలీసులు.


Tags

Read MoreRead Less
Next Story