మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదం

మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో ప్రమాదం

నాగర్ కర్నూలు జిల్లా మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటిలిప్ట్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. మోటార్ నుంచి భారీ శబ్దం వచ్చి పంప్ హౌజ్‌లోకి నీరు చేరింది. దీంతో పంప్ హౌజ్‌లో 49 అడుగుల మేర నీరుచేరింది. మోటార్లు పూర్తిగా మునిగిపోయాయి. సమాచారం అందుకున్న మంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డీలు సంఘటనా స్థలానికిచేరుకొని అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలకు అడిగి తెలుసుకున్నారు. తాగునీటి అవసరాలకోసం మూడో పంప్‌ మోటార్‌ను ఆన్ చేసిన సమయంలో ప్రమాదం చోటుచేసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రబీ పంటకు నీరు సమృద్దిగా ఉందని రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఈ ప్రమాదంపై అపోహలు నమ్మవద్దని మంత్రి సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story