తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. స్వర్ణకారులకు చేతినిండా పని

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. స్వర్ణకారులకు చేతినిండా పని
X

తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది. జ్యువెలరీ రంగంలో దిగ్గజం మలబార్ గ్రూప్ తెలంగాణలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. మంత్రి కేటీఆర్‌తో మలబార్ గ్రూప్ అధినేత ఎంపీ అహ్మద్, సీనియర్ ప్రతినిధి బృందం సమావేశం జరిగింది. మొత్తం 750 కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రంలో పెట్టనున్నట్టు మలబార్‌ గ్రూప్‌ తెలిపింది. 750 కోట్లతో గోల్డ్ మరియు డైమండ్ జ్యువలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్ లు ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణ కారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంస్థ తెలిపింది.

పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్‌కి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇది అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయంగా కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో స్వర్ణకార వృత్తిలో కొనసాగుతూ అద్భుతమైన కళ నైపుణ్యం కలిగిన వారు పలు జిల్లాల్లో ఉన్నారని, కంపెనీ ఇచ్చే ఉద్యోగాల్లో వీరందరినీ పరిగణలోకి తీసుకోవాలని కోరారు.. మలబార్ గ్రూప్ తమ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం వైపునుంచి అందిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

Next Story

RELATED STORIES