Top

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : సీఎల్పీ నేత భట్టి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలను నియంత్రించాలని భట్టి డిమాండ్ చేశారు.

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి : సీఎల్పీ నేత భట్టి
X

ఆస్పత్రుల సందర్శనలో భాగంగా సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో ఉన్న సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్యాన్ని అడిగి తెలుసుకున్నారు. గత ఆరున్నర సంవత్సరాలుగా రాష్ట్రప్రభుత్వం ఆస్పత్రులను పూర్తిగా గాలికి వదిలేసిందని భట్టి ఆరోపించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్ 11 పోస్టులకు గాను 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయని భట్టి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రోగులకు వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఆస్పత్రిలో 200 బెడ్లు ఉన్నా... సదుపాయాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న సిటీ స్కానింగ్, ఆంజియో గ్రామ్‌లు మూసివేసి.. ప్రైవేటు ఆస్పత్రులకు మేలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పేదలకోసం మాట్లాడుతుంటే.. ప్రభుత్వం మాత్రం రాజకీయాలు అంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ధరలను నియంత్రించాలని భట్టి డిమాండ్ చేశారు.

Next Story

RELATED STORIES