Medico Preethi: ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసి నిందితుడిని కాపాడాలని చూశారు

Medico Preethi: ప్రీతి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసి నిందితుడిని కాపాడాలని చూశారు
సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించిన గవర్నర్‌ తమిళిసై

కాళోజీ హెల్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ అధికారులపై గవర్నర్‌ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్‌ ప్రీతి ఆరోగ్యం సరిగా లేదని మొదట తప్పుడు ప్రచారం చేసి నిందితుడిని కాపాడటానికి ప్రయత్నించారంటూ సీరియస్‌ అయ్యారు. యూనివర్సిటీ వీసీకి లేఖ రాశారు గవర్నర్‌ తమిళిసై. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. మెడికల్‌ కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్‌ చర్యలు చేపట్టాలని మహిళా మెడికోలకు ప్రత్యేక గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇలాంటి సంఘటనలలో ఎలాంటి ఉదాసీనత లేకుండా తక్షణం స్పందించి కాలేజీలలో కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ ఆదేశించారు. మెడికల్‌ కాలేజీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పీజీ మెడికోల డ్యూటీ సమయాలు, వారికి సంబంధించిన తగిన విశ్రాంతి లాంటి అంశాలపై సరైన శ్రద్ధ పెట్టాలన్నారు. కౌన్సిలింగ్‌ సెంటర్‌లు కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story