KALESHWARAM: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్

KALESHWARAM: మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన జస్టిస్ పీసీ ఘోష్
ణువణువు పరిశీలించిన కమిషన్ సభ్యులు.... బ్యారేజీ దిగువకు వెళ్లి పియర్ కింది భాగంలో వచ్చిన పగుళ్లు పరిశీలన..

కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా జ్యుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ PC ఘోష్ మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. హైదరాబాదు నుంచి మహాదేవపూర్ మండలం అంబట్ పల్లి పంచాయతీ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న కమిషన్ సభ్యులకు కలెక్టర్ భవిశ్ మిశ్రా,ఎస్పీ కిరణ్ ఖరే స్వాగతం పలికారు. జస్టిస్ ఘోష్ కు పోలీస్ వందనం సమర్పించారు. అనంతరం... కమిషన్ కు సంబంధించిన అధికారులు, నిపుణుల బృందం సభ్యులు మేడిగడ్డ బ్యారేజీ పరిశీలించారు. మేడిగడ్డ బ్యారేజీపై ఏడో బ్లాకులో వంతెనపై కాలి నడకన వెళ్లి అణువణువు పరిశీలించారు. ఏడో బ్లాక్ లో 20వ పియర్ కుంగి, దెబ్బతిన్న ప్రాంతాన్ని చూసి.... వివరాలు సేకరించారు. బ్యారేజీ దిగువకు వెళ్లి... పియర్ కింది భాగంలో వచ్చిన పగుళ్లను.. పరీక్షించారు. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న పరిస్థితులు, పియర్ కుంగుబాటుపై అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. మేడిగడ్డ అతిథిగృహానికి చేరుకొని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను విచారించారు.


కీలక సూచనలు చేసిన ఎన్‌డీఎస్‌పీ

మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటు సహా అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకి....వర్షాకాలంలోగా తీసుకోవాల్సిన చర్యలను చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ.....రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటివరకు చేసిన పరిశీలన, అధ్యయనాలు........ ఇంజనీర్లతో మాట్లాడిన అంశాల ఆధారంగా తాత్కాలికంగా చేపట్టాల్సిన మరమ్మత్తులపై రాష్ట్ర నీటిపారుదలశాఖకు NDSAమధ్యంతర నివేదికఇచ్చింది. మేడిగడ్డని 2019 జూన్ లో ప్రారంభించి నీరు నిల్వచేసిన తర్వాత... వర్షాకాలం ముగిశాక ఆనకట్ట దిగువన సీసీబ్లాక్స్, ఆప్రాన్ దెబ్బతిన్నట్లు పేర్కొంది. నీటిని దిగువకు వదిలి మరమ్మత్తులు చేయాల్సి ఉన్నా అలా చేయకుండా జలాశయాన్ని వినియోగించినట్లు తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్‌ ఏడోబ్లాక్‌లో.... 11 నుంచి 22 నంబర్లవరకు పియర్స్ ఉంటే........... 16 నుంచి 21వ పియర్స్‌లో కదలిక ఉందని.... ర్యాప్ట్‌ సహా పియర్స్ ఎగువభాగంతోపాటు దిగువన కదలిక ఉందని కమిటీ తెలిపింది. 20వ నంబర్ పియర్..... 1.2 మీటర్ల కంటె ఎక్కువగా కుంగిందని అందులో భారీగా పగుళ్లు ఏర్పడినట్లు పేర్కొంది. గైడ్‌రెయిల్‌ సహా... రేడియల్ గేట్లు దెబ్బతిన్నాయని..ఇతరపియర్స్‌లోనూ పగుళ్లు ఏర్పడినట్లు వివరించింది. వాటితోపాటు ఇతర భాగాలైన గ్యాంట్రీ గిర్డర్, గ్యాంట్రీరెయిల్ అలైన్‌మెంట్ సహా ఆనకట్ట దిగువన ఉన్న సీబీ బ్లాక్స్, లాంచింగ్ ఆప్రాన్ దెబ్బతిన్నట్లు పేర్కొంది. అందులో కొన్నికొట్టుకుపోగా మరికొన్ని కదిలాయని... ప్లింత్‌స్లాబ్, వియరింగ్‌ కోట్ దెబ్బతిన్నట్లు నివేదికలో పేర్కొంది.


ఏడోబ్లాక్‌లోని 8 గేట్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని... ఆ బ్లాక్‌లోని పియర్స్, రాఫ్ట్ బాగాకుంగడంతో ఆ పరిస్థితి వచ్చిందని వివరించింది. 20వ పియర్‌ సహా రాఫ్ట్‌లో కదలికతో సీకెంట్ పైల్‌కటాఫ్, కాంక్రీట్ ప్లింత్ స్లాబ్ మధ్య ఉన్న ఖాళీని స్పష్టంచేసిందన్న కమిటీ... పియర్స్ దిగువన ప్లింత్‌స్లాబ్, సీకెండ్ పైల్ దెబ్బతిన్నట్లు తెలిపింది. పియర్స్‌ముందు ఇసుక పైపింగ్ రంధ్రాలున్నట్లు సీకెంట్ పైల్, పైల్‌రాఫ్ట్ జాయింట్‌సిస్టం, రాఫ్ట్ దిగువన, తదితరాలకు సంబంధించి మరింత లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని నిపుణుల అభిప్రాయపడింది..

Tags

Read MoreRead Less
Next Story