BRS: లోక్ సభ ఎన్నికల అజెండా ఫిక్స్..

BRS: లోక్ సభ ఎన్నికల అజెండా ఫిక్స్..
కాంగ్రెస్‌‌ ను ఇరుకున పెట్టేందుకు భారీ వ్యుహం..

లోక్‌సభ ఎన్నికల్లో సత్తాచాటేలా కార్యకర్తలను భారాస సిద్ధం చేస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ సహాపలువురు నేతలు నిర్వహిస్తూ శ్రేణులకి దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్న భారాస నేతలు...గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా మార్గనిర్దేశం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంకోల్పోవటం, ఇతరపార్టీల్లోకి నేతల వలసలతో సతమతమవుతున్న భారత రాష్ట్ర సమితి... లోక్‌సభ పోరులో సత్తాచాటేలా సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా విస్తృతసమావేశాలు నిర్వహిస్తూ శ్రేణుల్ని ఎన్నికలకు సమాయత్తం చేస్తోంది. నల్గొండలో నిర్వహించిన లోక్‌సభ నియోజకవర్గ భారాస విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న కేటీఆర్.కార్యకర్తల ఉత్సాహం చూస్తే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదన్నారు. గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు దృష్టిలో పెట్టుకొని లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి భాజపాలోకి వెళ్లే తొలివ్యక్తి రేవంత్‌రెడ్డి అని.. కేటీఆర్‌ పునరుద్ఘాటించారు.

హనుమకొండలో నిర్వహించిన భారాస విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైందన్నారు. టికెట్‌ ఇచ్చినా కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేశారని విమర్శించారు. వరంగల్ పార్లమెంట్‌ స్ధానానికి కడియం శ్రీహరి కుమార్తె కావ్యను పోటీలో నిలిపితే...మూడో స్ధానంలో ఉండడం ఖాయమని ముందే పార్టీకి చెప్పానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. కడియం కాంగ్రెస్‌లోకి వెళ్లాకే...గులాబీ శ్రేణుల్లో జోష్ వచ్చిందని ఓడించాలన్న కసి పెరిగిందని చెప్పారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేసీఆర్‌ను తిట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ సర్కారు పనిచేస్తోందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో భారాస కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. చేవేళ్ల నుంచి భారాస అభ్యర్థిగా పోటీచేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్‌ భారీమెజార్టీతో గెలిపించాలని సబిత కోరారు.

Tags

Read MoreRead Less
Next Story