భాగ్యనగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలు.. ఇవి తప్పనిసరి..

భాగ్యనగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలు.. ఇవి తప్పనిసరి..
భాగ్యనగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలను పునరుద్ధరించనున్నారు. మెట్రో రైళ్ల పున ప్రారంభంపై..

భాగ్యనగరంలో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలను పునరుద్ధరించనున్నారు. మెట్రో రైళ్ల పున ప్రారంభంపై MD NVS రెడ్డి, L&T MD KVB రెడ్డి సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.. ప్యాసింజర్‌లను బట్టి ఫ్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెట్రో స్టేషన్లతో పాటు రైళ్లలో భౌతికదూరం పాటించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మెట్రో MD NVS రెడ్డి తెలిపారు. భౌతిక దూరాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ప్రయాణికులు మాస్క్‌ను తప్పనిసరిగా పెట్టుకోవాలని.. లేనిపక్షంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనా అనుమానిత లక్షణాలు లేనివాళ్లకు మాత్రమే మెట్రో రైలులో అనుమతిస్తామని స్పష్టం చేశారు. మెట్రో ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేస్తామన్నారు. స్మార్ట్‌ కార్డు, క్యాష్‌ లెస్ విధానంలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.

మెట్రో రైళ్లను దశలవారీగా ప్రారంభించనున్నారు. ఫేజ్‌-1లో భాగంగా ఈ నెల 7న తొలుత కారిడార్‌-1 అంటే మియాపూర్‌ - ఎల్‌బీ నగర్‌ పరిధిలో మెట్రో రైళ్లు నడవనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకు రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఫేజ్‌-2 కింద ఈనెల 8న కారిడార్‌-3 అంటే నాగోల్‌- రాయదుర్గం మార్గంలో మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి. ఫేజ్‌-3 కింద ఈ నెల 9 నుంచి అన్ని కారిడార్లలో రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. అప్పుడు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాత్రమే మెట్రో సేవలు అందుబాటలో ఉంటాయి. తొలుత ఆయా మార్గాల్లో ప్రతి ఐదు నిమిషాలకు ఓ రైలు నడుస్తుందని, రద్దీకి అనుగుణంగా సమయాన్ని పెంచడమా? తగ్గించడమా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని మెట్రో ఎండీ తెలిపారు. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్న స్టేషన్లను మూసివేయాలని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో నగరంలోని గాంధీ హాస్పటల్‌, భరత్‌నగర్‌, మూసాపేట్‌, ముషీరాబాద్‌, యూసఫ్‌గూడ స్టేషన్లను మూసివేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story