తెలంగాణ

Metro Trains : ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. రేపట్నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యం పెంపు..!

Metro Trains : నగర ప్రయాణికులకి హైదరాబాదు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు.

Metro Trains : ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. రేపట్నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యం పెంపు..!
X

Metro Trains : నగర ప్రయాణికులకి హైదరాబాదు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పెంచుతున్నట్లు వెల్లడించారు. రేప‌ట్నుంచి ఉద‌యం 7 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు మెట్రో రైళ్లు ప్రయాణికుల‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. లాక్ డౌన్ సడలింపులో భాగంగా మెట్రో సేవ‌ల స‌మ‌యాన్ని పొడిగించారు. చివ‌రి రైలు ఒంటి గంట‌కు బ‌య‌ల్దేరి 2 గంట‌ల వ‌ర‌కు చివ‌రి స్టేష‌న్‌కు చేరుకోనుంది. అన్ని ర‌కాల ప్రజా ర‌వాణాకు మ‌రో గంట అద‌నంగా వెసులుబాటు క‌ల్పించారు. కాగా కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే.

Next Story

RELATED STORIES