వృద్ధుడి కష్టార్జితం.. రెండు లక్షలు ఎలుకలపాలు..!

వృద్ధుడి కష్టార్జితం.. రెండు లక్షలు ఎలుకలపాలు..!

Rats File Photo 

Mahabubabad:ఓ వృద్ధుడి కష్టార్జితం ఎలుకలపాలైంది. అనారోగ్యం బారిన పడిన ఓ వృద్ధుడు శస్త్రచికిత్స కోసం రెండు లక్షలు పొగుచేసుకున్నాడు.

Mahabubabad:ఓ వృద్ధుడి కష్టార్జితం ఎలుకలపాలైంది. అనారోగ్యం బారిన పడిన ఓ వృద్ధుడు శస్త్రచికిత్స కోసం రెండు లక్షలు పొగుచేసుకున్నాడు. తీరా ఆపరేషన్ సమయానికి రెండు లక్షల రూపాయలు ఎందుకు పనికి రాకుండా చేశాయి ఎలుకలు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని వేంనూరు శివారు ఇందిరానగర్ తండాకు చెందిన రెడ్యా కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. రెడ్యా రోజూ ఉదయాన్నే టీవీఎస్ ఎక్స్‌ఎల్ వాహనంపై చుట్టూపక్కల గ్రామాలకు వెళ్లి కూరగాయలు అమ్మగా వచ్చిన దాంతోనే కాలం వెల్లదీస్తున్నారు.

అయితే గత కొంత కాలంగా అతడికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. నాలుగేళ్లుగా కడుపులో కణితి పెరుగుతూ ఇబ్బంది పెడుతోంది. ఆస్పత్రులకు తిరిగితే రూ.4 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అయినా అయన అధైర్య పడకుండా కూరగాయలు అమ్మగా వచ్చిన నగదును ఇంట్లోనే భద్రపరిచారు. ఇలా రూ.2లక్షల వరకు కూడబెట్టారు. మరో రూ.2 లక్షలైతే ఆపరేషన్ చేయించుకోవచ్చని భావించారు. ఇంతలో అప్పుగా తెచ్చిన మరో రూ.రెండు లక్షలు బీరువాలో దాచిపెట్టారు.

శస్త్రచికిత్స చేయించుకుందామని నగదును తీసి చుడగా.. కరెన్సీ నోట్లను ఎలుకలు కొట్టేయడంతో విలపిస్తున్నారు. ఎన్ని బ్యాంకులు తిరిగిన ఎలుకలు కొరికిన డబ్బును తీసుకోనన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని రిజర్వ్ బ్యాంకు కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. దీంతో అతడు అక్కడి వెళ్లి ప్రయోజనం ఉంటుందో లేదో అని బాధపడుతున్నాడు.



Tags

Read MoreRead Less
Next Story