జగనన్న బాణం షర్మిల వస్తోంది.. తర్వాత మెల్లగా జగన్ వస్తాడు.. గంగుల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని.. తర్వాత మెల్లగా జగన్ వస్తారని, జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తారని వ్యాఖ్యనించారు.

X
Vamshi Krishna16 Feb 2021 2:26 PM GMT
మంత్రి గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్‌లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వైఎస్ షర్మిల పార్టీపై స్పందించారు. జగనన్న బాణం షర్మిల వస్తోందని.. తర్వాత మెల్లగా జగన్ వస్తారని, జగన్ తర్వాత చంద్రబాబు కూడా వస్తారని వ్యాఖ్యనించారు. తెలంగాణలో మళ్లీ కొట్లాటలు తప్పవని, కేసీఆర్‌ను మనం కాపాడుకోవాలని, లేకపోతే సమైక్య రాష్ట్రం అవుతుందని హెచ్చరించారు గంగుల కమలాకర్. కరెంటు, నీళ్లు ఎత్తుకుపోతారని, కేసీఆరే మనకు రక్షడున్నారు మంత్రి గంగుల కమలాకర్.
Next Story