Harish Rao : అనాథను చదివించి, పెండ్లి చేసిన హరీష్ రావు!

Harish Rao : అనాథను చదివించి, పెండ్లి చేసిన హరీష్ రావు!
తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మిగిలిన ఆడబిడ్డకు అన్నీ తానై అండగా నిలిచారు సిద్ధిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు..

తల్లిదండ్రులను కోల్పోయి అనాధగా మిగిలిన ఆడబిడ్డకు అన్నీ తానై అండగా నిలిచారు సిద్ధిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర ఆర్ధిక శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు.. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం కస్తూరిపల్లికి చెందిన భాగ్య కొన్ని సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మిగిలింది. ఈ విషయం తెలుసుకొని చలించిపోయిన మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో మాట్లాడారు.

సిద్దిపేట లోని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధీనంలో భాగ్యకు వసతి కల్పించారు. అప్పటికే ఇంటర్ చదువుతున్న భాగ్య ప్రస్తుతం ఎంఎస్‌డబ్ల్యూ చదువుతుంది. పెండ్లిడుకి వచ్చిన భాగ్యకు ఆమె కోరిక మేరకు ఇబ్రహీంనగర్‌కు చెందిన రాజుతో పెళ్లి చేశారు. సిద్దిపేటలోని టీటీసీ భవన్ లో జరిగిన ఈ పెళ్ళికి హరీశ్‌రావే పెండ్లి పెద్దగా వ్యవహరించారు. ఈ వివాహానికి మంత్రి హరీష్ తో పాటుగా జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, శిశు సంక్షేమశాఖ అధికారి రామ్‌గోపాల్‌రెడ్డి హాజరయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story