కేంద్రం లేఖ రాష్ట్రాల మెడ మీద కత్తి : మంత్రి హరీష్‌ రావు

కేంద్రం లేఖ రాష్ట్రాల మెడ మీద కత్తి : మంత్రి హరీష్‌ రావు

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి అని కేంద్రం లేఖ రాష్ట్రాల మెడ మీద కత్తి : మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధర కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని ఆదేశిస్తూ కేంద్రం రాష్ట్రాలకు రాసిన లేఖను హరీష్‌ రావు విడుదల చేశారు. ఓవైపు కేంద్రం మద్దతు ధర కన్నా ఎక్కువ ధర ఇవ్వొద్దని చెబుతుంటే.. మరోవైపు కేంద్ర మంత్రి మాత్రం ఎక్కువ ధర ఇవ్వాలని డిమాండ్ చేయడం విడ్డూరమని మండిపడ్డారు. రాష్ట్రాలకు రాసిన లేఖను కేంద్రం వెనక్కి తీసుకునేలా కిషన్ రెడ్డి చేయాలని కోరుతున్నానని డిమాండ్ చేశారు.

సెప్టెంబర్ 17, 2020న ధాన్యం మద్దతు ధర కంటే రైతులకు ఒక్క రూపాయి ఎక్కువ ఇచ్చినా రాష్ట్రాల నుంచి బియ్యం, వడ్లు సేకరించేది లేదని స్పష్టం చేస్తూ కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసిందని తెలిపారు. కేంద్రం విధానం వల్ల రైతులకు మద్దతు ధర కన్నా ఎక్కువ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని హరీష్‌ వెల్లడించారు.

కేంద్రం రాసిన లేఖ రాష్ట్రాల మెడ మీద కత్తి పెట్టేలా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 87లక్షల 84వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పడిందని.. రాష్ట్ర అవసరాలకు 26లక్షల టన్నులు సరిపోతుందన్నారు. మిగిలిన 61లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వం ఏం చేసుకోవాలని ప్రశ్నించారు. మిగిలిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని మంత్రి డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story