మంత్రి జగదీష్ రెడ్డి ఔదార్యం

మంత్రి జగదీష్ రెడ్డి ఔదార్యం
క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువతికి అండగా నిలిచారు. భయాన్ని దూరం చేయడం ద్వారా క్యాన్సర్‌ను జయించవచ్చని బాధితురాలికి ధైర్యం చెప్పారు

మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ యువతికి అండగా నిలిచారు. భయాన్ని దూరం చేయడం ద్వారా క్యాన్సర్‌ను జయించవచ్చని బాధితురాలికి ధైర్యం చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోని చివ్వేంల మండలం జగన్ తండాకు చెందిన ధరవత్ చాంప్ల- భూభా దంపతుల కుమార్తె స్వాతి చదువుతో పాటు ఆట పాటల్లోనూ చాలా చురుకుగా ఉంటుంది. డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉన్న స్వాతి ఒక్క సారిగా జ్వరం బారిన పడింది. దానికి తోడు కామెర్లు రావడం ఆపై ఫ్రాంక్రియాటిస్ కేన్సర్ గా మారడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు మానసిక ఆందోళనకు గురయ్యారు.

మందులతో కాలాన్ని నెట్టుకొస్తున్న స్వాతి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఏమైనా కోరికలు ఉంటే చెప్పమ్మా అన్న ప్రశ్నకు...స్వాతి సమాధానం విన్న తల్లి తండ్రులు ఒక్కసారిగా షాకయ్యారు. మంత్రి జగదీష్ రెడ్డితో మాట్లాడలనుంది..ఆయనను చూడాలనుంది.. ఆయనతో కలిసి భోజనం చెయ్యలని ఉందంటూ తన మనసులోని మాట బయట పెట్టింది. ఇది విన్న డాక్టర్ల బృందం మంత్రి జగదీష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

అందుకు స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి... యువతి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. వారితో కలసి అల్పాహారం తీసుకున్నారు. ఈ క్రమంలోనే తనకు ఒక్కసారి పోలీస్ ఆఫీసర్ కావాలని ఉందని మంత్రి జగదీష్ రెడ్డికి విన్నవించుకుంది బాధిత యువతి. వెంటనే ఎస్ పి రాజేంద్రప్రసాద్‌కు ఫోన్‌లో విషయాన్ని వివరించి స్వాతి మనసులో మాటను తీర్చాలంటూ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశించారు. మొత్తం మీద నెరవేరిన ఆశ.. సరికొత్త శ్వాసతో స్వాతి ఆనంద ఘడియలను మంత్రి జగదీష్ రెడ్డితో పంచుకున్నారు

Tags

Read MoreRead Less
Next Story