తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారింది: కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారింది: కేటీఆర్‌
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని... సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చిందని చెప్పారు.

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఏర్పాటు అవసరం లేదన్న కేంద్రంపై తెంలగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అవసరం లేదని... సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇచ్చిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కేంద్రంలోని బీజేపీకి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు మాదిరిగానే, కాజీపేట రైల్వే కోచ్ ప్రాజెక్టుకు బీజేపీ మంగళం పాడుతోందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పలుసార్లు కేంద్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినట్టు చెప్పారు. 150 ఎకరాల భూమిని సేకరించి కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రానికి అప్పగించామని తెలిపారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుంటే తెలంగాణకు తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతుందని కేటీఆర్‌ అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు తెలంగాణకు దక్కాల్సిన రాజ్యాంగబద్ధమైన హక్కు అని... పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని రద్దు చేసే అధికారం బీజేపీకి లేదని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story