గ్రేటర్‌ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించాం : మంత్రి కేటీఆర్

గ్రేటర్‌ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించాం : మంత్రి కేటీఆర్

చేతల్లో సామాజిక న్యాయం చూపిన పార్టీ టీఆర్‌ఎస్‌ అన్నారు మంత్రి కేటీఆర్‌. టీఆర్‌ఎస్‌భవన్‌లో...150 మంది అభ్యర్ధులకు బీ ఫారాలు అందజేసిన కేటీఆర్ ...అనంతరం.. హైదరాబాద్‌ ప్రగతి నివేదిక విడుదల చేశారు. ఈ సారి గ్రేటర్‌ ఎన్నికల్లో 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించామని, 85 మంది మహిళా అభ్యర్ధులకు టికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. ఎస్సీలకు 13, మైనార్టీలకు 17 సీట్లు ఇచ్చినట్లు తెలిపారు. అన్నవర్గాల వారికీ టీఆర్‌ఎస్‌ టిక్కెట్లు ఇచ్చినట్లు తెలిపారు.

గ్రేటర్‌ పరిధిలో రేపట్నుంచి.. ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న మంత్రి కేటీఆర్‌... పార్టీ అభ్యర్ధులకు, శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. ఆరేళ్లలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండబట్టే.... ఎలాంటి అల్లర్లు లేవన్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులు భారీగా వస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలవల్లే హైదరాబాద్‌ అభివృద్ధి జరుగుతోందన్నారు. అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా అని ప్రజల్ని అడగాలని టీఆర్ఎస్‌ అభ్యర్ధులను కోరారు మంత్రి కేటీఆర్‌.

Tags

Read MoreRead Less
Next Story