అభిమాని గుండెలపై కేసీఆర్.. వద్దన్న కేటీఆర్

పాపం అభిమానులు.. నాలుగు మాటలకు కరిగిపోతారు.. నాలుగు పథకాలకు మురిసిపోతారు.. వారు అభిమానించే నాయకుడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు.. ఓ బక్క రైతు అభిమానం పచ్చబొట్టు రూపంలో పెల్లుబికింది. రామాంజనేయులు అనే టీఆర్ఎస్ కార్యకర్త తన గుండెపై కేసీఆర్, కేటీఆర్ బొమ్మలతో పచ్చబొట్టు వేయించుకున్నారు. సోమవారం టీఆర్‌ఎస్ పార్టీలో బీజేపీ నేత రావుల శ్రీధర్ చేరిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రగతి భవన్‌కు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, రావుల అనుచరులు చేరుకున్నారు. ఈ క్రమంలో ఓ అభిమాని వేయించుకున్న పచ్చబొట్టు చూసి కేటీఆర్ విస్మయం చెందారు. ఇలాంటి సాహసాలు చేయొద్దని రామాంజనేయులతో పాటు ఇతర కార్యకర్తలను హెచ్చరించారు. అనంతరం ట్విట్టర్‌లోనూ కేటీఆర్ దీనిపై స్పందించారు. ఎవరూ ఇలా చేయవద్దంటూ మంత్రి హితవు పలికారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com