ఏటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి పురస్కారాలు : మంత్రి కేటీఆర్

అన్ని పురపాలక సంఘాలు అభివృద్ధి చెందాలనేదే సీఎం కేసీఆర్ ఆకాంక్షని చెప్పారు మంత్రి కేటీఆర్. పట్టణ ప్రగతి పేరిట అన్ని పట్టణాలకు సమయానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.. కొత్త పురపాలక చట్టంలో పచ్చదనం పెంచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు.. ఏటా ఫిబ్రవరి 24న పట్టణ ప్రగతి పురస్కారాలు అందిస్తామని చెప్పారు. యాదాద్రి భువనగిరిలో జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
మున్సిపాలిటీ పరిధిలోని వీధివ్యాపారులకు వివిధ బ్యాంక్‌ల నుంచి మంజురైన రెండున్నర రూ.6కోట్ల రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
అటు దుబ్బాక ఉపఎన్నికల వేడి జోరందుకుంది. దుబ్బాక నియోజవర్గంలోని పలు పార్టీలకు చెందిన వారు ఆర్ధికమంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. మంత్రి గులాబీ కండువాలను కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ పార్టీ మొదటి నుంచి రైతుల పక్షాన ఉందని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. బీజేపీ మాత్రం రైతుల నోట్లో మట్టి కొడుతుందని మంత్రి దుయ్యబట్టారు.
సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి యాదిలో... స్వప్న సాధకుడు' పుస్తకాన్ని హరీష్‌రావు ఆవిష్కరించారు. మరసం అనేక సభల్లో లింగన్నతో తాను అనేక వేదికలు పంచుకున్నానని, ఇప్పుడు ఆయన మన మధ్యలేకపోవడం బాధాకరమన్నారు హరీష్‌రావు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com