రానున్న రెండు రోజులు ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : కేటీఆర్

రానున్న రెండు రోజులు ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాలి : కేటీఆర్

హైద‌రాబాద్‌లోని వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్య‌టించారు. ముసారాంబాగ్‌లోని స‌లీంన‌గ‌ర్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం కేటీఆర్ ప‌ర్య‌టించి.. బాధితుల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు.

ఎల్బీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని బైరామ‌ల్‌గూడ‌లో హోంమంత్రి మ‌హ‌ముద్ అలీ, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డితో క‌లిసి కేటీఆర్ ప‌ర్య‌టించారు. వ‌ర‌ద ప్రాంతాల్లోని ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షించారు. లోత‌ట్టు ప్రాంతాల్లో చేరిన నీరు బ‌య‌ట‌కు పంపించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు.

వరదలో చిక్కుకున్న హబ్సీగూడ, రామంతాపూర్‌ పరిసర ప్రాంతాల ప్రజలను అన్ని విధాలా ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని కేటీఆర్ తెలిపారు.

రానున్న రెండు రోజుల పాటు ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాలిని సూచించారు. బాధితులకు న‌ష్ట ప‌రిహారం చెల్లిస్తామ‌ని కేటీఆర్ భ‌రోసా ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story