Top

బీజేపీ నేతలు మాత్రం భ్రమలు కల్పిస్తున్నారు : బాల్క సుమన్

సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని 2014 జూన్‌లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తుచేశారు.

బీజేపీ నేతలు మాత్రం భ్రమలు కల్పిస్తున్నారు : బాల్క సుమన్
X

కేంద్రం పరిధిలోని పనులు చేయకుండా బీజేపీ నేతలు భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ విప్ బాల్కసుమన్. సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని 2014 జూన్‌లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తుచేశారు. ఇప్పటి వరకు దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బండి సంజయ్‌కి దమ్ముంటే సీబీఐతో ఎంక్వైరీ చేసుకోవచ్చని కౌంటరిచ్చారు. తెలంగాణ వచ్చాక సింగరేణిలో 14వేల ఉద్యోగాలు ఇచ్చామని, లాభాల వాటాను 28శాతానికి పెంచామని బాల్క సుమన్ వివరించారు. సీఎం కేసీఆర్ మీద మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.

Next Story

RELATED STORIES